Tuesday 27 May 2008

వేసవి తాపం

అందరికీ నమస్కారం!!!చాలా రోజులయ్యింది కదా కలిసి....
ఏంటోనండి పేరుకి సెలవులే కానీ ఖాళీగా ఉన్నా ఒక్క పనీ చెయ్యబుద్ధి కావట్లేదు...అందుకే ఈ కాలయాపన...సరే అందరూ ఈ వేడిలో వేడి మామిడిపళ్లు,హిమక్రీములు(అవే ఐస్‌క్రీములు),శీతల పానీయాలు(కూల్ డ్రింక్స్) వదిలిపెట్టట్లేదనుకుంట...అలాగే వేడిలో చలవ మజ్జిగ,ముంజలు లాంటివి కూడా రుచి చూసే ఉంటారు..కొత్త ఆవకాయ ఏమంటోంది...???సరే సరే విషయానికి రా ఇంకా అంటున్నారా...ఇదిగో వచ్చేస్తున్నా....ఏదో రాద్దామని చాలా కాలం క్రితం మొదలుపెట్టానండి...కాని దానికి సరైన ముక్తాయింపు ఇవ్వాలంటే ఇదే సరైన సమయం అని ఇప్పుడనిపిస్తోంది...ఏంటంటారా మన వేసవిలో విడుదలైన అన్ని చిత్రాల్లో "జల్సా" నా వరకు మంచి సినిమా అనిపించింది...ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మళ్లీ ఫాం లోకి వచ్చాడు...త్రివిక్రం తెచ్చాడు...అటు పక్క మా గురువుగారు,దేవి శ్రీ ప్రసాద్ లు పాటలు అదరగొట్టారు....అలాగే విడుదలైన మిగిలిన చిత్రాల్లో కూడా మా గురువుగారు రాసిన పాటలన్నీ ఈ పోస్ట్ సారాంశం....

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనగానే అందరికీ(కొంచెం సినీ జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా)
"విరించినై విరచించినది" అనే పాట,"జగమంత కుటుంబం నాది" అనే ఆణిముత్యాలు గుర్తుకు వస్తాయి...అది సహజం....కాని ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి మరికొన్ని పాటలు వినిపిస్తే గానీ తెలీదు...అబ్బా...అలాగా...అవేంటో చెప్పమ్మా అంటారా??వినుకోండి మరి...
"భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు","క్లాస్‌రూములో తపస్సు","Do it just do it"("భద్ర" చిత్రంలో మొదటి పాట),
"బోటని పాఠముంది" ఇలాంటి పాటలన్న మాట...ఇందులో గురువుగారు తన ఆంగ్ల పదకోశం(English vocabulary) నుంచి పదాలను ఎక్కువ వాడారన్నమాట...
"ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావ్ రా బాబు!!!" అంటే మాత్రం "జల్సా" లో పాటల కోసమే...ఏమిటా పాటలు అంటే "My heart is beating " మరియు "You and I " ...ఈ రెండు పాటల్లో "You and I" పాటలో ఆంగ్ల పదాల కోసం dictionary వెతుక్కోవలసి వచ్చింది.Googling చెయ్యాల్సి వచ్చింది.Wikipedia చూడాల్సి వచ్చింది.
ఇంత ఎందుకు చేయ్యాల్సిన అవసరం ఏంటి అంటే అభిమానం అండి అభిమానం...అంతే...
సరే ముందు రెండు పాటల సాహిత్యం చూడండి.."My heart is beating " పాట లో అర్థం కాని పదాలు ఏమీ లేవు నాకు తెలిసి...కాబట్టి దానికి వివరణ ఇవ్వట్లేదు...ఆ పాట సాహిత్యం లో ఉన్నా అందాన్ని గుర్తించండి చాలు ....
"You and I " పాటకు మాత్రం ఇస్తున్నాను....తరవాత "కంత్రి" చిత్రం లో గురువుగారు రాసిన ఒక ద్యూయెట్, "రెడీ'"చిత్రం లో గురువుగారు రాసిన రెండు పాటల సాహిత్యం కూడా చూద్దురుగాని...

సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
గానం:కే.కే
చాలా అద్భుతం గా పాడాడు కే.కే. అని వేరే చెప్పక్కర్లేదు..మీ అందరి మనసు దోచింది ఈ పాట అని నాకు తెలుసు
Listen to the song హియర్
http://www.musicindiaonline.com/p/x/8Wf_UZJAxS.As1NMvHdW/

my heart is beating అదోలా తెలుసుకోవా అదీ...
ఎన్నాళ్లీ waiting అనేలా తరుముతోందీ మదీ..
పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతీ
కనులలో వెతికితే దొరుకుతుందీ
teaspoon టన్ను బరువవుతుందే
full moon నన్ను ఉడికిస్తుందే
cloud nine కాళ్లకిందకొచ్చిందే
landmine గుండెలో పేలిందే

my heart is beating అదోలా తెలుసుకోవా అదీ...
ఎన్నాళ్లీ waiting అనేలా తరుముతోందీ మదీ..

పెనుతుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా
మునుపు లేని మైకాన మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లూ ఒంటరిగా వేగాలా
cell phone నీ కబురు తెస్తుంటే stun gun మోగినట్టు ఉంటుందే
crompton fan గాలి వీస్తుంటే cyclone తాకినట్టు ఉంటుందే

my heart is beating అదోలా తెలుసుకోవా అదీ...
ఎన్నాళ్లీ waiting అనేలా తరుముతోంది మదీ....

ఎపుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలలవనం
తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం
freedom దొరికినట్టు గాలుల్లో welcome పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్లి పోతుందే
my heart is beating అదోలా తెలుసుకోవా అదీ...
ఎన్నాళ్లీ waiting అనేలా తరుముతోంది మదీ....


You and I అనే పాట lyrics ikkaDa రాశాను చూడండి...very energetic number...and extra-ordinary lyrics...
Listen to the song here
http://www.musicindiaonline.com/p/x/8Bf_ZvvCxd.As1NMvHdW/

గానం:దేవి శ్రీ ప్రసాద్

యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!
hakuna matata అదిగో తమాషగా తలవూపి
వెరైటిగా సద్దంపిద్దాం మైకం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో ఐతే dont worry be happy
మరో రకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
you and i lets go high and do ballE ballE
life is like saturday night lets do ballE ballE
O O O O O O lets do ballE ballE
O O O O O O lets do ballE ballE
యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా zero అయిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!

ఎన్నో రంగుల జీవితం
నిన్నే పిలిచెను స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం
కన్నీరైనా అమృతం
కష్టం కూడా అద్భుతం కాదా
botanical భాషలో petals పూరేకులు
material science లో కలలు మెదడు పెను కేకలు
mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
you and i lets go high and do ballE ballE
life is like saturday night lets do ballE ballE
O O O O O O lets do ballE ballE
O O O O O O lets do ballE ballE
యే జిందగీ నడపాలంటే హస్‌తే హస్‌తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హీరోషిమా zero అయిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే!!

పొందాలంటే victory పోరాటం compulsory
risk అంటే ఎల్లా మరీ బోలో
ఎక్కాలంటే హిమగిరీ ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే history లిఖ్‌లో....
Utopia ఊహలో అటొ ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమో బూటకం
Anatomy lab లో మనకు మనము దొరకం
you and i lets go high and do ballE ballE
life is like saturday night lets do ballE ballE
O O O O O O lets do ballE ballE
O O O O O O lets do ballE ballE


ఈ పాట వివరణ కి వస్తే ఇందులో గురువుగారు ఎంతొ చక్కటి philosohy చెప్పారు
"hakuna matata" అంటే ఏమిటబ్బా...ఇదేదో "Lion King" cartoon serial title song లో విన్నట్టుంది అనుకుంటున్నారా...అదేనండి అదే...కాని దాని అర్థం ఏమిటి??It means "No worry.Be happy"
ఆ పదం "స్వాహిలి" అనే భాష లోది...
"Utopia" అంటే ideal world where everything is perfect
"Euphoria" means extremely strong feeling of happiness that lasts for a short time though.
ఇప్పుడు పాట lyrics చదవండి. మా గురువుగారు ఏమి చెప్పాలనుకున్నారో బోధపడుతుంది...అర్థం కాకపోతే నాకొక కామెంట్ రాసిపడెయ్యండి...నాకు తెలిసింది చెప్తాను....


ఈ సినిమా లోనే ఇంకొక మంచి పాట గురువుగారు రాసింది ఉన్నది..నక్సలిజం గురించి రాసారు...ఒకసారి ఆ పాట కూడా చూడండి....
Listen to the song
http://www.musicindiaonline.com/p/x/xWf_SWgf9d.As1NMvHdW/
గానం : రంజిత్

చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
చంపనిదే బతకవనీ... బతికేందుకు చంపమనీ
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
సంహారం సహజమనీ... సహవాసం స్వప్నమనీ
తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
అపుడెపుడో ఆటవికం... మరి ఇపుడో ఆధునికం
యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
రాముడిలా ఎదగగలం... రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవికిరణం చీల్చగలం... రంగులుగా మార్చగలం
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్

ఇప్పుడు చెప్పండి...ఆయన ఒక ordinary human being కాడు...ఆయన ఎంతో జ్ఞానం ఉన్నా తాత్త్వికుడు అని అర్థమయ్యి ఉంటుంది...ఆయన సమసమాజం గురించి పడే వేదన ఈ పాటలో మనం ప్రస్ఫుటంగా చూడవచ్చు....

ఇక కంత్రి చిత్రం లో ఒక regulation duet రాసారు...అయినప్పతికీ ఎంత బాగా రాశారు అనేది గమనించ దగ్గ విషయం...
Listen to the song here
http://www.musicindiaonline.com/p/x/Nsf_5hmRSS.As1NMvHdW/
సంగీతం:మణి శర్మ
గానం:చిత్ర , కార్తీక్
one more time
one more time
అమ్మహా అనిపించేలా ఎంత పని చేశావే బాలా... శతవిధాలా... మతి చెడేలా
అయ్యహో కంగారేలా అందరూ గమనించే వేళా... రకరకాల... కలవరాలా...
ఏమైందంటే ఏం చెబుతానే ఎవ్వరికైనా
గాయమేదంటే చూపించే వీలుందా ఏమైనా
ఏమయో ఏమైపోతున్నావో ఈ మైకం లో
రోమియో అయిపోతావా పాపం మాలోకం లో
one more time
one more time

నాకిలా అయినట్టే నీకు కాలేదంటే నమ్మమంటావా చెప్పు..నాలా పైకనవంతే
నువ్వలా అనుకుంటే నవ్వుకుంటానంతే...ఒప్పుకుంటావా చెప్పు నువ్వన్నది కాదంటే
నిన్నే చూసుండకపోతే నా మనసే చేజారేదా
నిజమంటే ఇపుడూ చేదే...నీ నేరం ఏమీ లేదా
అంతలా అయ్యయ్యయ్యో నిందలే వెయ్యొద్దయ్యో
one more time
one more time

ఎందరో నీ కన్నా సుందరీమణులున్నా... ఎన్నడూ కన్నెత్తైనా చూశానా ఎవ్వరినైనా
నేను కాదన్నానా...ఎంత లక్కనుకోనా...మొక్కులే నీ రూపం లో దక్కాయని కలగననా
నువ్వు పుట్టిన తేదీ కన్నా ముందే రాసుందే మైనా
కాబట్టే ఈ భూమ్మీద జన్మించానే నెరజాణా
మాట ముడి వెయ్యొద్దయ్యో చేతబడి చెయ్యొద్దయ్యో
one more time
one more time

అమ్మహా అనిపించేలా ఎంత పని చేశావే బాలా... శతవిధాలా... మతి చెడేలా
అయ్యహో కంగారే ఇలా అందరూ గమనించే వేళా... రకరకాల... కలవరాలా...
ఏమైందంటే ఏం చెబుతానే ఎవ్వరికైనా
గాయమేదంటే చూపించే వీలుందా ఏమైనా
ఏమయో ఏమైపోతున్నావో ఈ మైకం లో
రోమియో అయిపోతున్నావా మాలోకం లో

"రెడీ" చిత్రం లో ఈ title song చాలా youthful and energetic గా ఉంది అనటంలో అతిశయం లేదు..
అసలు చూడండి సాహిత్యం ఒక్కసారి..ఈ పాట కూడా జల్సా చిత్రం విషయం లో చెప్పిన ఆంగ్ల పదకోశానికి సంబంధించిన
పాటే...extraordinary lyrics...youth will like it..should like it....
Listen to the song here
http://www.musicindiaonline.com/p/x/osO_rPQUxt.As1NMvHdW/

సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
గానం:కార్తీక్

Get ready to give a smile
Get ready to do your style
Get ready to rock your life
Get ready..ready..
Get ready to be yourself
Get ready to go and have
Get ready to rock your life
Get ready..ready..

ఎప్పుడైనా రెడీ..ఎక్కడైనా రెడీ..
అందుకుంటే చెయ్యందిస్తాం దోస్తీకి మేము కట్టుబడి
కాదలైనా రెడీ....కార్డులైనా రెడీ
దేనికైనా ఓకే అంటాం తప్పించుకోం భయపడి
చల్ చల్ రే అంది జమానా..
చెలరేగే వేగం ఆగేనా
ఎటు దాగున్నా కనిపెడదాం రా మన futureని వెంటపడి

Get ready గొంతు విప్పడానికే
Get ready గోల చెయ్యటానికే
Get ready డోలు కొట్టడానికే
Get ready..ready...
Get ready స్పీడు పెంచడానికే
Get ready దూసుకెళ్లడానికే
Get ready ఢీ కొట్టడానికే

ఈ college కథ continue కదా
ఈ అందమైన ఆనవాళ్లు తలుచుకుంటే వందేళ్లు చాలవేమొరా
కభి అల్విదా అనకంది ఎద
ఈ తీపి తీపి ఙాపకాలు చూపగానే రేపులన్ని happyగా నవ్వుతాయిలా
మన google కళ్లని పంపిద్దాం...ఈ globeని వెనక్కి తిప్పిద్దాం

రేపెపుడైనా కన్నీళ్లెదురైతే ఈ తీపి చూపిద్దాం
Get ready sweet symphonyలకే
Get ready hot భాంగ్రా లకే
Get ready cute తందనాలకే
Get ready hand కలపడానికే
Get ready band కట్టడానికే
Get ready bond పెంచడానికే

ఎవరా cinderella leading modelలా
Love symbolఅంటి గుండెలోన బాణమల్లె గుచ్చుకుంది నొప్పైన తీయగుందిరా
ఇంకో wonder ఆ అనిపించిందిరా
కొత్త చందమామ పుట్టినట్టు కంటిరెప్ప కొట్టుకుంది చూపైనా తిప్పలేనురా
Rainbow లో ఉండే VIBGYOR తానై వచ్చిందా బోలో యార్
నే daily రాసే diaryలో కొన్ని colours నింపింది...

Get ready line వెయ్యడానికే
Get ready risk చెయ్యడానికే
Get ready ishq పొందడానికే
Get ready...ready
Get ready చీటు ఇవ్వడానికే
Get ready date పెట్టడానికే
Get ready heart పట్టడానికే
Get ready...ready



ఈ పాట కి ఎంత సందర్భముందో తెలీదు కానీ సాహిత్యం మాత్రం చాలా romantic గా ఉంది...మీరే చూడండి..
Listen to the song here
http://www.musicindiaonline.com/p/x/pBO_UbNbh9.As1NMvHdW/

గానం:సాగర్, గోపిక పూర్ణిమ
నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే,కల నేనవుతా
నా పాదం నువ్వైతే,నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే,వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకి
నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే,కల నేనవుతా
నా పాదం నువ్వైతే,నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే,వెలుగే అవుతా

కనిపించని బాణం నేనైతే,తియతియ్యని గాయం నేనవుతా
వెంటాడే వేగం నేనైతే,నేనెదురవుతా
వినిపించని గానం నేనైతే,కవి రాయని గేయం నేనవుతా
శృతి మించే రాగం నేనైతే,జతి నేనవుతా
దివి తాకే నిచ్చెన నేనవుతా,దిగివచ్చే నెచ్చెలి నేనవుతా
నిను మలిచే ఉలినే నేనైతే,నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనవుతా
నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే,కల నేనవుతా
నా పాదం నువ్వైతే,నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే,వెలుగే అవుతా

వేధించే వేసవి నేనైతే,లాలించే వెన్నెల నేనవుతా
ముంచెత్తే మత్తును నేనైతే,మైమరపవుతా
నువ్వోపని భారం నేనైతే,నిన్నాపని గారం నేనవుతా
నిను కమ్మే కోరిక నేనైతే,రా రమ్మంట
వెలిగించే మంటను నేనైతే,రగిలించే జంటను నేనైతే
పదునెక్కిన పంటిని నేనైతే,ఎరుపెక్కిన చెక్కిలి పంచిన చక్కెర విందే నేనవుతా
నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వైతే,కల నేనవుతా
నా పాదం నువ్వైతే,నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వైతే,వెలుగే అవుతా

అదండీ విషయం....ఇక్కడ చెప్పాల్సిన విషయం దేవి శ్రీ ప్రసాద్ గురించి...అతని మ్యూజిక్ ఎప్పుడూ చాలా native గా ఉంటుంది...అంటే మన lyricists కి సరళంగా ఉంటుంది ....
"రెడీ" ఆడియో ఫంక్షన్ లో గురువుగారు కూడా అదే అన్నారు..వారిద్దరి కలయికలో ఎన్ని మంచి పాటలొచ్చాయో చెప్పక్కర్లేదు..ఒకవేళ మాకు తెలీదు అన్నారనుకోండి...
వినుకోండి ఐతే...
ఆనందం,సొంతం,వర్షం,పౌర్ణమి,జల్సా,మన్మథుడు,ఖడ్గం...
ఈ చిత్రాల్లోనే కాకుండా మరికొన్నిటిలో ఇద్దరి కాంబినేషన్ లో అద్భుతమైన పాటలున్నాయి...సమయం వచ్చినప్పుడు చెబుతాను..కాని ఈ చిత్రాల్లో చాలా వరకు ఇద్దరి కలయికలో వచ్చినవే...

Thursday 28 February 2008

శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ....

వారానికొక పోస్ట్ చెయ్యకపోతే నా చేతులు ఊరుకోవట్లేదు...ఎందుకంటే గురువుగారి పాటలు ఎన్ని ఉన్నాయి...ఒకటా రెండా....అందులో నాకు తెలిసినవన్నీ ఇక్కడ చెప్పాలంటేనే చాలా కాలం పడుతుంది...సరే ఇదంతా మాకెందుకు...పాటేంటో చెప్పమంటారా???ఐతే వినండి...ఈ వారానికి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వం లో వచ్చిన స్వర్ణకమలం చిత్రం లో పాట....

ఈ చిత్రం లో "శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ" అనే పాట, "ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్లు" అనే పాట ఉన్నాయని మీ అందరికీ తెలిసిందే....ఇక ఈ పాటల వివరాలకొస్తే రెండూ గురువుగారు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే రాశారు...సినిమాలో భానుప్రియ తండ్రి నుంచి వారసత్వంగా నాట్యం నేర్చుకున్నప్పటికీ ఆమె ఆశలు,ఆశయాలు వేరే విధంగా ఉంటాయి..ఆమె ఎప్పుడూ కలల లోకం లో విహరిస్తూ ఉంటుంది...వారి పక్కింట్లోకి అద్దెకు దిగుతాడు వెంకటేష్....ఆమెలోని నాట్యగత్తెను ఆరాధిస్తాడు...ఆమెను కళాకారిణిగా చూడాలని తపిస్తాడు..కాని ఆమె మాత్రం ఇతని ఆలోచనలకు పూర్తిగా విరుద్ధం గా ఉంటుంది...ఇలాంటి వారిద్దరి అభిప్రాయాల సంఘర్షణే ఈ రెండు పాటల సారాంశం...సిరివెన్నెల గారు ఈ పాటలు రాసేటప్పుడు అందరిలాగే హీరో ఆలోచన సరైనది కాబట్టి అతని దృష్టికోణం నుంచి ఆలోచించి "శివపూజకు" పాటలో మొదటి కొన్ని వాక్యాలు రాశారట...
"శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా"

చాలా బాగా కుదిరినాయి ఈ వాక్యాలు అనుకున్నారట...కానీ అప్పుడే వచ్చింది అసలు సమస్య...ఈ పాటలో హీరోయిన్ కూడా ఉంటుంది...ఆమె తన వైపు నుంచి కూడా వాదన వినిపించాలి కదా...మరి ఆ వాదన కూడా రాయాల్సింది గురువుగారే...హీరో వాదన చాలా బలంగా వినిపించేశాం...ఎంత ఆలోచించినా హీరోయిన్ వాదన బలంగా రాయటం కుదరలేదట...రెండు రోజులు తలమునకలయ్యేట్టు ఆలోచించగా,చించగా అప్పుడు మిగతా వాక్యాలు కుదిరాయట....

"పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా"

ఇప్పుడు మనం గమనిస్తే ఇద్దరి వాదన సరైనదే అనిపిస్తుంది...
"నేను నాట్యం కోసమో మరే దాని కోసమో పరుగాపేస్తే నేను,నా మది కోరుకున్న మధుసీమలను ఎలా చేరుకోగలను....నాకవే ముఖ్యం" అన్న హీరోయిన్ వాదనను కూడా ఎంత సముచితంగా రాశారో గమనించండి...

ఇంకా రెండో చరణం విషయానికొస్తే

"పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయరవళి ఓంకారం కానీ"

ఆమె ఊహాలోకాన్ని పడమర పడగలతో పోల్చారు...అంటే అదీ అస్తమించిన సూర్యుడితో సమానం....అది ఒక పాము లాంటిది అన్నారు...అలాంటి పడమర పడగలపై మెరిసే తారలకై(పాము పడగ మీద మెరిసే రత్నాల లాగా) రాత్రిని వరించకు అనేది భావం ఇక్కడ...తూరుపు వేదిక మీద నర్తకిలా, ఈ భూమి మెచ్చుకునే కాంతులనివ్వు...నీలో వచ్చిన కదలిక చైతన్యానికి తొలిమెట్టు కానివ్వు...అందరినీ ఎదిరించిన ఆ గుండె చప్పుడే ఓంకారం అవ్వనివ్వు అనే భావం కూడా ఎంత అందంగా ఉందో గమనించండి

మరి ఈ వాదనకి హీరోయిన్ ఏమన్నది??


"తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా"

"నేను వేళ్లే సంకెళ్లై కదలలేని మొక్కలా ఉన్న చోటే ఉంటూ ఎప్పుడో ఆమని(వసంతం) వస్తుందని ఎదురు చూడను...భూమికి అన్ని వైపులా అంతులేని అందముంది...ఆ అందాన్ని చూసే ఆనందం అనే గాలి నన్ను నడిపిస్తోంది...దానితో పాటే నన్ను వెళ్లనివ్వు...
ప్రతి రోజూ ఎదో ఒక కొత్త గీతం స్వాగతించనీ నన్నిలా....వెన్నెల పాడే పాట నాకు తోడు ఉందిగా...." అని సమర్థించుకుంది హీరోయిన్...

ఇంకా చివరి వాక్యాలు అద్భుతం కదా!!!
"చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం
తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభన సువర్ణ కమలం"

నీ విలాసం నీ ఆడే పాదాల నుంచి పుట్టినదే...నీ సౌందర్య వికాసం(brightness) మెరిసే కిరణాలతో సమానంగా ఉంది...నీ అభినయ ఉషోదయం(నటన అనే ఉషోదయం) చూసిన ఆ సూర్యుడు ఆకాశం అనే సరస్సు లో వికసించిన వంద దళములు(రేకులు=petals) ఉన్న బంగారు కమలం లాగా అనిపిస్తాడు....


ఇద్దరి వాదనలు సమానంగా సరితూగినపుడే పాటకు అర్థం,అందం...అలా రాయగలగటం ఆ కవి ప్రజ్ఞ...
సంగీతం విషయానికొస్తే ఇళయరాజా తనకి శాస్త్రీయమైనా,western అయినా తిరుగులేదని నిరూపించుకున్నారు మరొకసారి.....బాలు,సుశీల పాటను ముగ్ధమనోహరంగా తమ తమ గొంతులతో తీర్చిదిద్దారు...ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసుకోవటంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు...
పాట ఇక్కడ వినండి...
http://www.chimatamusic.com/search.php?st=kamal&sa=Go%21
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా

పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించిరావా
పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయరవళి ఓంకారం కానీ
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వా

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా
పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం
తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం
తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభన సువర్ణ కమలం

పరుగాపక పయనించవే తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదె త్రోవా

Thursday 21 February 2008

అలుపన్నది ఉందా.....

ఫెలిసిటి నిషా మొత్తం దిగిపోయింది...ఇప్పుడిప్పుడే మామూలు లోకం లోకి వస్తున్నాం అంతా నెమ్మదిగా...మరి అలాంటప్పుడు నా blog కూడా తన పాతపనిని మొదలుపెట్టాలి కాబట్టి ఈ సారి మరో మంచి పాటతో మీ ముందుకొస్తున్నాను....
పాట ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తున్నారా..ఐతే చూడండి మరి

అలుపన్నది ఉందా ఎగిసే అలకు, యదలోని లయకూ..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకూ..
మెలికలు తిరిగే నది నడకలకూ
మరి మరి ఉరికే మది తలపులకూ
ల ల ల ల ల ల ల ల లా....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ,యదలోని లయకూ..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకూ..

నా కోసమే చినుకై కరిగి, ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి, దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా, నా ఊహలకు
కలలను తేవా, నా కన్నులకు
ల ల ల ల ల ల ల ల లా....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ,యదలోని లయకు..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు..

నీ చూపులే తడిపే వరకు,ఏమయినదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు, ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే, తరుణం కొరకు...
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల ల ల ల ల లా....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ,యదలోని లయకు..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు..
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల....


పాట చూడగానే మన సినీ,సంగీత ప్రేమికులందరికీ ఈ పాటికి తెలిసుండాలే...
హా అదే...
చిత్రం:గాయం
సంగీతం:శ్రీ
రచన:సిరివెన్నెల(ఎప్పటిలాగే)
గానం:కె.ఎస్.చిత్ర


సినిమాలో రేవతి పాత్రకి ఈ పాట లో వస్తుంది...
journalist గా రాణిద్దామనుకున్న రేవతి ఆలోచనలు,ఊహలు ఎలా ఉంటాయో,ఎలాంటి స్వతంత్ర భావాలని కలిగి ఉంటుందో పాట మొదటి చరణంలో చెప్పారు....

"నా కోసమే చినుకై కరిగి...ఆకాశమే దిగదా ఇలకూ..."
ఆకాశం ఎందుకు దిగదు అన్న ఒక ఆత్మవిశ్వాసం నిండిన మొండితనంతో పాటు, వస్తుంది అన్న ఆశావాదం కూడా ఉండటం గమనించవచ్చు మనం ఈ లైన్ లో...

"నా సేవకే సిరులే చిలికి...దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా...నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు"
పైన చెప్పిన భావమే ఈ వాక్యాల్లో కూడా దొర్లుతుందనే విషయం గమనించాలి...i mean those lines show that Revati's role oozes confidence...

ఈ పాటకి ఎవరెవరు యేయే విధంగా న్యాయం చేశారో చివర్లో చెప్పుకుందాం మళ్లి...

రెండో చరణం వచ్చేసరికి ప్రేమ వస్తుంది...జగపతి బాబు పాత్రతో ప్రేమలో ఉన్న రేవతి పాత్ర అతని ప్రేమలో ఉండటం వల్లే నాలో ఉన్న ఈ అందాలు,భావాలు బయటికి వచ్చాయి అని చెప్పటం ఎంత బావుందో ఇది చదవగానే మీరు ఫీల్ అవ్వండి...మీకే తెలుస్తుంది....

"నీ చూపులే తడిపే వరకు, ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు,ఎటు ఉన్నదో మెరిసే సొగసు"

ఈ రెండు వాక్యాలని బట్టి ఒక ప్రేమికుడికి లేదా ప్రేమికురాలికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది....ప్రతి వ్యక్తిలోను ఎన్నో అందమైన భావాలు,రొమాంటిక్ నేచర్ ఉంటుంది...కాని దాన్ని బయటకి తీసుకురాగలిగిన వాళ్లు ఒకరే ఉంటారు...ఆ ఒక్కరే మన ప్రేమికుడు/ప్రేమికురాలు అవుతారు....అదన్నమాట దీనిలోని ఆంతర్యం...
అందరికీ తెలిసినదే అయినా ఆ వివరణ వింటున్నప్పుడు కలిగే ఆనందం కోసమైనా వివరణ ఇవ్వాలనిపిస్తుంది....మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను...
ఒకమాటైతే ఖరాఖండిగా చెప్పగలను...నా dream girl మాత్రం ఈ పాటలో చెప్పిన విధంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను పాట విన్నప్పుడల్లా...

ఇంకా పాట వివరాలకొస్తే ముందు పాట రాసిన సిరివెన్నెల,సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ ల గురించి చెప్పాలి...గురువుగారు(సిరివెన్నెల) గారు ఒకే పాటలో మనకి ఆయన కల కరవాలం(పెన్ అనే కత్తి) కి రెండు వైపులా పదునుందని చూపారు...రాంగోపాల్ వర్మ ఒక్కడే ఆ పాటని అంత రొమాంటిక్ గా తీయగలడని నా నమ్మకం....రాము కి గురువుగారికి అవినాభావ సంబంధం ఉంది...రాము తన డైరెక్ట్ తెలుగు సినిమాలన్నిటికీ గురువుగారినే రాయమంటాడు....అదే అలవాటు అతని దగ్గర పని చేసిన కృష్ణ వంశీ కి కూడా ఉండటం విశేషం....సంగీత దర్శకుడు శ్రీ...చక్రవర్తి గారి కొడుకేగాని ఆయన ప్రభావం శ్రీ సంగీతం లో మీకు లేశమాత్రమైనా కనపడదు...చాలా మంచి సంగీత దర్శకుడు...ఈ పాటను వింటూ ఉంటే తెలిసిపోతుందిలెండి...ఇంకా పాట పాడిన చిత్ర గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది...అసలు మన తెలుగు అమ్మాయిలే నాకు తెలిసి ఈ పాటలోని భావాలన్నీ తెలుసుకుని అవన్నీ పలికించేట్టు పాడగలరో లేదో నాకు తెలియదు...కాని చిత్ర గారు రావటం రావటం నుంచే గొంతు కి గొంతు,ఉచ్చారణ కి ఉచ్చారణ భావాలకి భావాలు(expressions ki expressions)...వేటికవే...తిరుగులేదంతే....



నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి మీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికినడ చొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం


కొసమెరుపుగా ఇదే సినిమా లోని ఇంకొక పాట ఇస్తున్నాను...ఇది ఒక పాట అనటం కన్నా మన సమాజం ఉన్న నీచ స్థితిని చూస్తూ ఒక చదువుకున్న మనిషి ఈ జనాలను మార్చలేక పడే వేదన అంటే బావుంటుందేమో...సినిమాలో ఈ పాట ఒక journalist పాడతారు...ఆ పాత్రలో మరెవరో కాకుండా గురువుగారే(సిరివెన్నెల గారు ఉండటం విశేషం....చాలా వేదనతో కూడుకున్న ఆవేదనాభరిత గీతం...అందరిని ఆలోచింపజేసే పాట అని చెప్పచ్చు....పాడినవారు మన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు.....బాలు గారి టాలెంట్ ఏంటో, ఆయన ఎవరికి పాడుతున్నా అది బాలు కాక ఆ పాత్ర పాడుతున్నట్టే ఉంటుంది...he is a gift to our film industry...he is a living legend in the playback singing field.....
ఇంతకీ పాటలో మా గురువుగారు ఏమి రాశారో చూశారు కదా!!!ఆయన ఒక సినీకవి మాత్రమే కాదు, గొప్ప philosopher,thinker కూడా...కాబట్టి ఆయన చెప్పినదేదో ఒకసారి ఆలోచిద్దాం...

Monday 11 February 2008

Telugu Antyaakshari in Felicity08

ఫెలిసిటి లో తెలుగు అంత్యాక్షరి గురించి ఎవరు మాట్లాడినా నేను ఇలా మొదలెడుతున్నా...ఇప్పటి వరకు అసలు లేని ఈవెంట్ ని స్టేజ్ మీదకి తెచ్చాను...జనాలు లోపల "వీడు డబ్బా కొట్టుకుంటున్నాడేంట్రా??" అని అనుకున్నా విషయం ఐతే అది....ఎందుకంటే నా నోటిని,నా మొండితనాన్ని మొత్తం వాడేసి ఆ ఈవెంట్ ని ఫెలిసిటి లో పెట్టించటమే కాకుండా మెయిన్ స్టేజ్ మీదకి ఎక్కించాను...ఇంకా నా చిరకాల కోరిక అయిన anchoring కూడా తీర్చేసుకున్నాను....
my ego is satisfied...it is that i too can do no bad anchoring....
thanks to karan for encouraging me to conduct antyaakshari right from day1 when i proposed this idea in felicity idea blog......

ఇంకా అంత్యాక్షరి విషయానికి వస్తే నేను మొదటి నుంచి నేను single-handed గా కండక్ట్ చేసేయ్యగలను అనుకున్నాను....కాని అది నేను ముందు నుంచి పని చేసుంటే సాధ్యం అయ్యేది....మనమా బద్ధకించాం...ఇంకో కారణం ఏంటంటే పేపర్ లీక్ అవుతుందేమో అన్న భయం....అసలే నాకు excitement ఎక్కువ కదా!!!!సరే పోని నేనొక్కడినే ఆ పని చెయ్యగలిగానా అంటే ఐడియా లు మాత్రం నవత(co-anchor and co-organizer) తో కలిసి వేశాను...కాని ఆ వచ్చేసరికి నాకు సాయం చెయ్యగలిగే ఇద్దరే మనుషులు కనపడ్డారు....గోపాల్,భరత్ రాం....ఐడియాలకి ఐడియాలు,హెల్ప్ కి హెల్ప్,పాటకి పాట,మాటకి మాట....నేను వాళ్లిద్దరి సాయం ఎప్పటికీ మర్చిపోలేను...విషయం ఇక్కడితో అయిపోతే ఫర్వాలేదు...కానీ వాళ్లు లేకపోతే అసలు ప్రిలింస్,మెయిన్స్ రెండు నిర్వహించటం నాకు గగనకుసుమమే అయ్యేది...ఎందుకంటే సాయం చెయ్యడం ఎవరన్నా చేస్తారు...కాని నన్ను అర్థం చేసుకుని మంచి కెమిస్ట్రీ తో పని చేశారిద్దరూ.....
ప్రిలింస్ అప్పుడు గోపాల్ ఒక జూనియర్ తో కలిసి publicity చేశాడు...ఎలా అనుకుంటున్నారా...Motorola school ముందు ఒక టేబుల్ వేసుకుని దారి వెంబట పోయే ప్రతి ఒక్కళ్లని పిలిచి మరీ చెప్పాడు అంత్యాక్షరి జరుగుతోంది పైన.... వెళ్లండి అని...ఇంకా భరత్ రాం నా వెన్నంటే ఉన్నాడు...he got the question papers photocopied and also helped in correcting them and what not....

జూనియర్స్ కూడా చాలా సాయం చేశారు...ఏ పని చెప్పినా,ఎంత దూరం వెళ్లమన్నా ఒక్క మాట ఎదురు చెప్పకుండా చేశారు....ఫణి కృష్ణ,రాజేష్,సునీల్....వాళ్లే కాకుండా ఇంకా మరి కొంత మందిని తీసుకొచ్చి మరీ సాయం చేశారు...మరి వీళ్లందరికీ ధన్యవాదాలు చెప్పకుండా ఊరుకుంటే ఎలా.....అందుకే ఈ పోస్ట్....

ఇంకా ఎవరినో మర్చిపోయాను కదా!!!అవును ఎవరు వాళ్లు...???భాను కిరణ్, నవత,చరణ్....భాను కిరణ్ మొదటి నుంచి అంతా monitor చేస్తూ ఫలానా టైం కి ఫాలానా పని చెయ్యండి అని మమ్మల్ని బాగా లీడ్ చేశాడు...నేనొక్కడినే చూసుకుంటానంటే, అలా కాదు....నీతో పాటు ఎవరన్నా female co-anchor ఉంటే బావుంటుంది అన్నాడు..and then came Navatha into the picture....నవత కూడా చాలా planned గా చేసింది పనంతా....she wasn't feeling well the last few days...otherwise i think she could have done still better....she was my partner in classical dance also...her suggestions helped me do better there also...Thank u very much Navatha....

చరణ్-వీడు నా కోసం,తెలుగు అంత్యాక్షరి కోసం మెయిన్ స్టేజ్ ఇప్పించాడు అందరితో మాట్లాడి.....time and place constraints వల్ల తెలుగు అంత్యాక్షరి ఫైనల్ రౌండ్ కూడా Motorola లో పెట్టేద్దామని అడ్డమైన జనాలు వాగితే,వాళ్లతో మాట్లాడి స్కెడ్యూల్ మార్పించి మూడో రోజుకి తెలుగు అంత్యాక్షరి పెట్టించి ఎలాగైనా మెయిన్ స్టేజ్ మీదే జరిగేట్టు చూశాడు...అంతే కాదు,రెండో రోజు ఎండ పడి హిందీ అంత్యాక్షరి కి జనాలు రాకపోతే,చెర్రి షామియానాలు వేయించాడు ఆడియన్స్ కోసం...మరి వాడిని ఎలా మర్చిపోను చెప్పండి...love u cherry maama....

ఇంకా participation vishayaaniki వస్తే, అంత మందిని చూసేసరికి నా ఉత్సాహం ఒక్కసారి రెట్టింపయ్యింది...అసలు అంత మంది బయట వాళ్లు వస్తారని అనుకోలేదు...వచ్చారు,విజయవంతం చేశారు...నేను IIIT teams ఎక్కువ ఉంటాయనుకున్నాను.....కాని బయట వాళ్లు కూడా తక్కువేమి రాలేదు...పాపం ఒక టీం అయితే సికింద్రాబాద్ నుంచి నాకు ఫోన్ చేశారు...ఎప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో ప్రెలింస్ స్టార్ట్ అవుతుందనగా....మేము అంత్యాక్షరి కోసమే వస్తున్నాము...మమ్మల్ని include చేస్తారా అని...అక్కడి నుంచి వాళ్లు వచ్చేసరికి కనీసం గంట పడుతుంది....ఎలా అబ్బా అనుకున్నా...నాకు వాళ్లని participate చెయ్యనివ్వాలని 100% అనిపించింది...వాళ్ల enthusiasm నచ్చింది...గోపాల్ ని సలహా అడిగా...వాడు సమస్య లేదు...వచ్చెయ్యమను..మనం చూసుకుందాం అన్నాడు...రమ్మన్నాను...వాళ్లు ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయ్యింది...ప్రిలింస్ అయిపోయింది...
అయినా వాళ్లకి ఇద్దరు జూనియర్స్‌ని ఇచ్చి,రాయనిచ్చాం ప్రిలింస్...పాపం వాళ్లు క్వాలిఫై అవ్వలేదు...కాని అది వేరే విషయం...వాళ్లు అంత దూరం నుంచి రావటం నాకు నచ్చింది....

ప్రిలింస్ నుంచి మెయిన్ స్టేజ్ కి వచ్చిన టీంస్ గురించి అందరికీ తెలుసు...కాని ప్రిలింస్ లో qualify అవ్వకపోయినా అందరిని మెప్పించిన టీం హేమంత్,సందీప్ వాళ్ల టీం...theirs is quality participation....and Rama Reddy and Sana Pradeep's team...their performance was beyond my expectations...Amruta and Team from St.Francis never seemed like people for Telugu Antyaakshari...But they did exceptionally well in the prelims....They looked like North Indian people....

If I don't mention about Anusha(&Team) from VNR, our discussion about this Telugu Antyaakshari is definitely incomplete....I was very vexed with the correction process..Then started round 2...
rapid fire antyaakshari round with 90 secs duration.Though our Harshita,Anupama & team sing well that couldn't bring me out of that vexation....Then in between she(Anusha) was questioning about many people singing only one line,this and that...Then I said "Madam,we are here naa..U don't worry.." I got annoyed...But she gave me an instant's shock with her divine voice....I used to think that P.Suseela , S.Jaanaki & Chitra are the only females with such thin voice line and sweet voice...But this girl showed me the reality....And after her singing I couldn't control my emotions,I whistled and what not....Before the final round I came to know that she was my super senior in Nalanda(Intermediate) which means I don't know her...She don't know me....And even on the main stage,when she sang that "Om namo nama" song from SURYA IPS movie,I tried not to indulge in between...But I cudn't...I joined my light voice to hers...I felt really happy...Thank you Anusha for making my event special with your voice....

మరి అదండీ సంగతి....ఇంకా మిగిలినవి మీ కామెంట్స్ మాత్రమే....


PS : place and time constraints ఉన్నాయని తెలుగు అంత్యాక్షరి ని Motorola లో పెడదామన్న జనాలని అదే పని హిందీ అంత్యాక్షరికి ఎందుకు చెయ్యకూడదు అని అడగాలనిపిస్తుంది...సరే అంతా సజావుగా అయిపోయింది కాబట్టి lite....

Wednesday 16 January 2008

జగమంత కుటుంబం నాది...

సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాట రావటానికి ఈ మధ్యే "చక్రం" సినిమా లో వచ్చినప్పటికీ ఆయన ఇది రాసి చాలా కాలం అయ్యింది...సరైన అవకాశం దొరకక వాడలేదు...ఈ పాటలో చాలా ఆర్ద్రత ఉంది...ఆర్ద్రత అంటే???heart touching feel అన్నమాట...ఇది చదివితే తెలుస్తుంది ప్రతి ఒక్క మనిషికీ తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో...ఇక చెప్పటం అనవసరం...పాటను చూడండి...

"చక్రం" సినిమా లోని ఈ పాటకు చక్రి సంగీతం అందించాడు...పాటలోని సాహిత్యం పాడవకుండా రాగం కట్టాడు చక్రి...అతన్ని తప్పకుండా మెచ్చుకోవాలి....మరో ప్రత్యేకత ఏంటంటే ఈ పాటని మరొక సినీ సంగీత దర్శకుడు "శ్రీ" (శ్రీనివాస్-ప్రముఖ సంగీత దర్శకుడు కీ.శే.చక్రవర్తి గారి తనయుడు) పాడాడు...గొప్ప మాధుర్యం ఉన్న గొంతు కాకపోయినా ఆ పాటలో అవసరమైన భావాలన్నిటినీ తన గళంతో పలికించగలిగాడు శ్రీ....చిత్రం లో ప్రభాస్ పాత్రకు ఈ పాట ఆ సన్నివేశంలో బాగా నప్పింది కూడా...కనీసం ఈ పాట దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమాను చూడచ్చు(మీకు సున్నిత భావాలు నచ్చితే..'మాకు ఈ ఏడుపుగొట్టు సినిమాలు వద్దూ అనేవాళ్లకి నేను చెప్పను)...

పాటను ఇక్కడ వినటానికి ప్రయత్నించండి
http://www.musicindiaonline.com/p/x/VrI_t.Iynd.As1NMvHdW/

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
కవినై.... కవితనై..... భార్యనై.... భర్తనై
కవినై ....కవితనై ......భార్యనై.....భర్తనై
మల్లెల దారిలో... మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాలు
నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని,రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ..
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల,హరిణాల్ని హరిణాల,చరణాల్ని చరణాల, చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని..

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగివెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

రవి=సూర్యుడు
శశి=చంద్రుడు
దివం=రోజు
నిశి=రాత్రి
సినీవాలి=అమావాస్య నాటి చంద్రుడు

Wednesday 9 January 2008

అల్లో అల్లో అల్లో అందరికి నమస్కారమండి

అసలు ఈ సదరు blog ఎందుకు అని మాత్రం నన్నడక్కండి…ఏదో నా బుర్రకు తోచిన కుర్రాలోచనలని మీ అందరికి వినిపిద్దామని ఒక చిలిపి కోరిక…అంతేనండోయ్..మీరు ఆ మాత్రం దానికి నీ blog మాత్రమే ఎందుకు చూడాలి అని మాత్రం అడక్కండి…ఎందుకంటే దానికి సమాధానం నాక్కూడా తెలీదు కాబట్టి…ప్రస్తుతానికి నాకు ఈ blog ని ఎలా హడావుడిగా ఉంచాలా అనే ఆలోచన నా బుర్ర తొలిచేస్తోంది…అందుకే నా దగ్గర ఉన్న తెలుగు సినిమా పాటల
lyrics (మంచి మంచి పాటలే పెట్టుకున్నాలెండి) మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను…వాటిలోని అందాన్ని ఆస్వాదించ ప్రయత్నిద్దాం…ఏమంటారు???ప్రస్తుతానికి ఏమన్నా అంటానికి కూడా ఎవరూ లేరు కదా!!!సరే మరి మొదటి పాటగా ఏ పాట పెడదాం???
నేను తెలుగు సినీ కవులలో బాగా ఇష్టపడేది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని..వారిని నా గురువుగా భావిస్తాను కూడా….ఎందుకంటే నేను పుట్టిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు విన్న పాటల్లో(కనీసం కొత్త పాటల్లో) ఆయన రాసినవే ఎక్కువ వినటం అవ్వనీయండి లేక ఎక్కువ ప్రభావం చూపినవి అవ్వనీయండి ఆయన రచనలే…ఎంత సరళంగా,వినసొంపుగా ఉంటాయో మాటల్లో చెప్పటం కష్టం…
ఆయన్ని ఆరాధించడానికి ఇంకొక కారణం ఏమిటంటే పూర్వం సంగీత దర్శకులు కవులు పాట రాసాక దానికి రాగం కట్టేవారు..కాని గొప్ప సంగీత దర్శకులైనప్పటికీ “ఇళయరాజా” గారి తరం నుంచే సంగీతం ఇచ్చాక పాట రాసే ప్రక్రియ ఆరంభమయ్యింది…మీరు ఏ సినీ కవిని అడిగినా,కొంచెం సంగీత ఙానం ఉన్న వారినెవరినడిగినా ముందు రచన,తరువాత రాగం కట్టడమే సరైన పద్ధతి అంటారు…కారణాలు
1)కవికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చి భావవ్యక్తీకరణ చేసే అవకాశాన్ని కలిగిస్తే పాట అత్యద్భుతంగా వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే
2)రాగం ఇచ్చాక రచన చేస్తే ఆ రాగంలో పదాలను ఇరికించినట్టుంటుందే తప్ప సంతృప్తికరంగా ఉండదు…ఇది కేవలం నా భావన కాదనేది గమనించ ప్రార్థన.

కాబట్టి సంగీతం ఇచ్చాక పాటలను రాయటం అనే ప్రక్రియ లో ఆద్యుడు శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు…సిరివెన్నెల గారు ఆయన్ను తన గురువుగా భావిస్తారు…గురువుకి గురువు కాబట్టి నాకు పూజ్యుడే…అదే కాకుండా ఆయన పాటలు విన్నాక కూడా మీరు ఆయన గొప్పతనాన్ని కాదనలేరు….కాబట్టి పైన చెప్పుకున్న ప్రక్రియ లో అత్యద్భుతంగా విజయం సాధించిన వారెవరని అడిగితే నేను తడుముకోకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారని చెప్పగలను…..

అదేంటి విజయాన్ని నువ్వెలా నిర్వచించగలవ్???
పాటను ఎలా రచించాలి?????
1)సందర్భానుసారంగా రచించాలి….
2)సరళంగా “అందరికి అర్థమయ్యేట్టుగా” రచించాలి…
ఇవి కొంచెం పేరు మోసిన సినీ కవులెవరైనా చేస్తున్నారు కదా అని మీరు ప్రశ్నించచ్చు..అప్పుడు గురువుగారి ప్రజ్ఞ బయటికొస్తుంది…పైన చెప్పిన రెండు విషయాలు ఆయనకు కరతలామలకమే….అవి కాక పాటను “అందంగా”,”ప్రాసతో” నింపి,ఏ మాత్రం “అసభ్యత”(obscenity) లేకుండా రాయటం కత్తి మీద సాము కాదంటారా చెప్పండి…ఇక్కడ మనకి ఎదురొచ్చిన విషయం “అసభ్యత లేకుండా”….శృంగారానికి,అసభ్యతకు చాలా తేడా ఉంది…
మన సినీ నిర్మాతలకు,దర్శకులకు,తారలకు(చాలా వరకు) పాట అంటే సినిమా లో కావాల్సిన మసాలా దొరికే స్థలం…మాస్ ని ఆకట్టుకునే నృత్యాలు,బూతులు తప్ప మరొక దృష్టి లేదు…
గురువుగారు ఈ విషయంలో తన వేదనని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు…
శృంగారం అనేది కేవలం శరీరానికి,అవయావాలకు సంబంధించినది కాదు,రెండు మనసులకు సంబధించినది…కానీ దురదృష్టవశాత్తూ మన తెలుగు సినిమాలు కేవలం ఆ మొదట చెప్పిన విషయానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప అసలు విషయాన్ని గ్రహించట్లేదు….

ఇలా చెప్పుకుంటూపోతే గురువుగారి గురించి అది ఒక్క పోస్ట్ తో అయిపోయేది కాదు కాబట్టి మన మొదటి పాట విషయానికి వద్దాం….గురువుగారి మొదటి చిత్రం “సిరివెన్నెల” చిత్రం నుంచి “విధాత తలపున” అనే పాట(అందరికి సుపరిచితమే అని నా అభిప్రాయం) పోస్ట్ చేస్తున్నాను…దీనిలో అందాన్ని,సొబగులని మనం ఒకళ్లకొకళ్లం వివరించుకుందాం…ఈ పాటను నేను ఏ వెబ్‌సైట్ నుంచో కాపీ పేస్ట్ చెయ్యలేదు…పాట వింటూ రాశాను కాబట్టి తప్పు చేస్తే గీస్తే అది నేనే..కాబట్టి తెలియజేయవలసినదిగా నా మనవి…

ఒక చిన్న మాట:నేను ఇక్కడ పోస్ట్ చేసే అన్ని పాటలు పాట వింటూ నేను రాసుకున్నవే…ఏ వెబ్సైట్ నుంచో చూసి రాసినవి కావు..గమనించ ప్రార్థన

విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవన వేదం
ఓం…………….
ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం ఓం……
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం…….
ఆ ఆ ఆ…..
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం…. ఈ గీతం..

విరించినై విరచించినది ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వర గతి జగతికి శ్రీకారము కాదా…
విశ్వకావ్యమునకిది భాష్యముగా
విరించినై విరచించినది ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించినది ఈ కవనం…
విపంచినై వినిపించితిని ఈ గీతం….

నా ఉచ్ఛ్వాసం కవనం
నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం…. ఈ గీతం..
ఈ సందర్భం లో ఈ పాట గురించి మిగిలిన వివరాలు కూడా ఎంతో అవసరం కదా!!
కె.వి.మహదేవన్ గారు గొప్ప సంగీత దర్శకుడు..నేను ఇంతకు ముందు చెప్పినట్టు కాకుండా ఆయన పట్టు పట్టి పాట రాశాకే రాగం కట్టేవారు..అలాంటి సంగీత దర్శకులుండటం నిజంగా ఒక గొప్ప వరం…ఈ పాటను పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల గారు తమ గళమాధుర్యంతో పావనం చేశారు…
ఈ సినిమా దర్శకుడు కె.విశ్వనాథ్ గారి గురించి సినీ ప్రేమికులకి చెప్పనవసరం లేదు…ఆయన ఒక్కొక్క చిత్రం ఒక ఆణిముత్యం…ఆస్కార్ వరకు వెళ్లిన తెలుగు చిత్రాలు ఆయనవే అని చెప్పటానికి నేను చాలా గర్విస్తున్నాను….ఆయన తీసుకున్న కథలోని గొప్పదనం వలనే వాటికి తగినట్టు సాహిత్యం రాశారు గురువుగారు,రాగం కట్టారు మహదేవన్ గారు….హాట్సాఫ్ టు విశ్వనాథ్ గారు