Wednesday 16 January 2008

జగమంత కుటుంబం నాది...

సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాట రావటానికి ఈ మధ్యే "చక్రం" సినిమా లో వచ్చినప్పటికీ ఆయన ఇది రాసి చాలా కాలం అయ్యింది...సరైన అవకాశం దొరకక వాడలేదు...ఈ పాటలో చాలా ఆర్ద్రత ఉంది...ఆర్ద్రత అంటే???heart touching feel అన్నమాట...ఇది చదివితే తెలుస్తుంది ప్రతి ఒక్క మనిషికీ తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో...ఇక చెప్పటం అనవసరం...పాటను చూడండి...

"చక్రం" సినిమా లోని ఈ పాటకు చక్రి సంగీతం అందించాడు...పాటలోని సాహిత్యం పాడవకుండా రాగం కట్టాడు చక్రి...అతన్ని తప్పకుండా మెచ్చుకోవాలి....మరో ప్రత్యేకత ఏంటంటే ఈ పాటని మరొక సినీ సంగీత దర్శకుడు "శ్రీ" (శ్రీనివాస్-ప్రముఖ సంగీత దర్శకుడు కీ.శే.చక్రవర్తి గారి తనయుడు) పాడాడు...గొప్ప మాధుర్యం ఉన్న గొంతు కాకపోయినా ఆ పాటలో అవసరమైన భావాలన్నిటినీ తన గళంతో పలికించగలిగాడు శ్రీ....చిత్రం లో ప్రభాస్ పాత్రకు ఈ పాట ఆ సన్నివేశంలో బాగా నప్పింది కూడా...కనీసం ఈ పాట దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమాను చూడచ్చు(మీకు సున్నిత భావాలు నచ్చితే..'మాకు ఈ ఏడుపుగొట్టు సినిమాలు వద్దూ అనేవాళ్లకి నేను చెప్పను)...

పాటను ఇక్కడ వినటానికి ప్రయత్నించండి
http://www.musicindiaonline.com/p/x/VrI_t.Iynd.As1NMvHdW/

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
కవినై.... కవితనై..... భార్యనై.... భర్తనై
కవినై ....కవితనై ......భార్యనై.....భర్తనై
మల్లెల దారిలో... మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాలు
నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని,రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ..
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల,హరిణాల్ని హరిణాల,చరణాల్ని చరణాల, చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని..

జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగివెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది

రవి=సూర్యుడు
శశి=చంద్రుడు
దివం=రోజు
నిశి=రాత్రి
సినీవాలి=అమావాస్య నాటి చంద్రుడు

1 comment:

aaaalu said...

Hi...I do not think that "cini Vaali" means what is mentioned there....Am I wrong. Despite that..a very good post. I am one of those that love this songs.