Thursday 21 February 2008

అలుపన్నది ఉందా.....

ఫెలిసిటి నిషా మొత్తం దిగిపోయింది...ఇప్పుడిప్పుడే మామూలు లోకం లోకి వస్తున్నాం అంతా నెమ్మదిగా...మరి అలాంటప్పుడు నా blog కూడా తన పాతపనిని మొదలుపెట్టాలి కాబట్టి ఈ సారి మరో మంచి పాటతో మీ ముందుకొస్తున్నాను....
పాట ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తున్నారా..ఐతే చూడండి మరి

అలుపన్నది ఉందా ఎగిసే అలకు, యదలోని లయకూ..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకూ..
మెలికలు తిరిగే నది నడకలకూ
మరి మరి ఉరికే మది తలపులకూ
ల ల ల ల ల ల ల ల లా....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ,యదలోని లయకూ..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకూ..

నా కోసమే చినుకై కరిగి, ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి, దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా, నా ఊహలకు
కలలను తేవా, నా కన్నులకు
ల ల ల ల ల ల ల ల లా....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ,యదలోని లయకు..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు..

నీ చూపులే తడిపే వరకు,ఏమయినదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు, ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే, తరుణం కొరకు...
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల ల ల ల ల లా....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ,యదలోని లయకు..
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు..
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల....


పాట చూడగానే మన సినీ,సంగీత ప్రేమికులందరికీ ఈ పాటికి తెలిసుండాలే...
హా అదే...
చిత్రం:గాయం
సంగీతం:శ్రీ
రచన:సిరివెన్నెల(ఎప్పటిలాగే)
గానం:కె.ఎస్.చిత్ర


సినిమాలో రేవతి పాత్రకి ఈ పాట లో వస్తుంది...
journalist గా రాణిద్దామనుకున్న రేవతి ఆలోచనలు,ఊహలు ఎలా ఉంటాయో,ఎలాంటి స్వతంత్ర భావాలని కలిగి ఉంటుందో పాట మొదటి చరణంలో చెప్పారు....

"నా కోసమే చినుకై కరిగి...ఆకాశమే దిగదా ఇలకూ..."
ఆకాశం ఎందుకు దిగదు అన్న ఒక ఆత్మవిశ్వాసం నిండిన మొండితనంతో పాటు, వస్తుంది అన్న ఆశావాదం కూడా ఉండటం గమనించవచ్చు మనం ఈ లైన్ లో...

"నా సేవకే సిరులే చిలికి...దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా...నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు"
పైన చెప్పిన భావమే ఈ వాక్యాల్లో కూడా దొర్లుతుందనే విషయం గమనించాలి...i mean those lines show that Revati's role oozes confidence...

ఈ పాటకి ఎవరెవరు యేయే విధంగా న్యాయం చేశారో చివర్లో చెప్పుకుందాం మళ్లి...

రెండో చరణం వచ్చేసరికి ప్రేమ వస్తుంది...జగపతి బాబు పాత్రతో ప్రేమలో ఉన్న రేవతి పాత్ర అతని ప్రేమలో ఉండటం వల్లే నాలో ఉన్న ఈ అందాలు,భావాలు బయటికి వచ్చాయి అని చెప్పటం ఎంత బావుందో ఇది చదవగానే మీరు ఫీల్ అవ్వండి...మీకే తెలుస్తుంది....

"నీ చూపులే తడిపే వరకు, ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు,ఎటు ఉన్నదో మెరిసే సొగసు"

ఈ రెండు వాక్యాలని బట్టి ఒక ప్రేమికుడికి లేదా ప్రేమికురాలికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది....ప్రతి వ్యక్తిలోను ఎన్నో అందమైన భావాలు,రొమాంటిక్ నేచర్ ఉంటుంది...కాని దాన్ని బయటకి తీసుకురాగలిగిన వాళ్లు ఒకరే ఉంటారు...ఆ ఒక్కరే మన ప్రేమికుడు/ప్రేమికురాలు అవుతారు....అదన్నమాట దీనిలోని ఆంతర్యం...
అందరికీ తెలిసినదే అయినా ఆ వివరణ వింటున్నప్పుడు కలిగే ఆనందం కోసమైనా వివరణ ఇవ్వాలనిపిస్తుంది....మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను...
ఒకమాటైతే ఖరాఖండిగా చెప్పగలను...నా dream girl మాత్రం ఈ పాటలో చెప్పిన విధంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను పాట విన్నప్పుడల్లా...

ఇంకా పాట వివరాలకొస్తే ముందు పాట రాసిన సిరివెన్నెల,సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ ల గురించి చెప్పాలి...గురువుగారు(సిరివెన్నెల) గారు ఒకే పాటలో మనకి ఆయన కల కరవాలం(పెన్ అనే కత్తి) కి రెండు వైపులా పదునుందని చూపారు...రాంగోపాల్ వర్మ ఒక్కడే ఆ పాటని అంత రొమాంటిక్ గా తీయగలడని నా నమ్మకం....రాము కి గురువుగారికి అవినాభావ సంబంధం ఉంది...రాము తన డైరెక్ట్ తెలుగు సినిమాలన్నిటికీ గురువుగారినే రాయమంటాడు....అదే అలవాటు అతని దగ్గర పని చేసిన కృష్ణ వంశీ కి కూడా ఉండటం విశేషం....సంగీత దర్శకుడు శ్రీ...చక్రవర్తి గారి కొడుకేగాని ఆయన ప్రభావం శ్రీ సంగీతం లో మీకు లేశమాత్రమైనా కనపడదు...చాలా మంచి సంగీత దర్శకుడు...ఈ పాటను వింటూ ఉంటే తెలిసిపోతుందిలెండి...ఇంకా పాట పాడిన చిత్ర గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది...అసలు మన తెలుగు అమ్మాయిలే నాకు తెలిసి ఈ పాటలోని భావాలన్నీ తెలుసుకుని అవన్నీ పలికించేట్టు పాడగలరో లేదో నాకు తెలియదు...కాని చిత్ర గారు రావటం రావటం నుంచే గొంతు కి గొంతు,ఉచ్చారణ కి ఉచ్చారణ భావాలకి భావాలు(expressions ki expressions)...వేటికవే...తిరుగులేదంతే....



నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి మీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికినడ చొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం


కొసమెరుపుగా ఇదే సినిమా లోని ఇంకొక పాట ఇస్తున్నాను...ఇది ఒక పాట అనటం కన్నా మన సమాజం ఉన్న నీచ స్థితిని చూస్తూ ఒక చదువుకున్న మనిషి ఈ జనాలను మార్చలేక పడే వేదన అంటే బావుంటుందేమో...సినిమాలో ఈ పాట ఒక journalist పాడతారు...ఆ పాత్రలో మరెవరో కాకుండా గురువుగారే(సిరివెన్నెల గారు ఉండటం విశేషం....చాలా వేదనతో కూడుకున్న ఆవేదనాభరిత గీతం...అందరిని ఆలోచింపజేసే పాట అని చెప్పచ్చు....పాడినవారు మన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు.....బాలు గారి టాలెంట్ ఏంటో, ఆయన ఎవరికి పాడుతున్నా అది బాలు కాక ఆ పాత్ర పాడుతున్నట్టే ఉంటుంది...he is a gift to our film industry...he is a living legend in the playback singing field.....
ఇంతకీ పాటలో మా గురువుగారు ఏమి రాశారో చూశారు కదా!!!ఆయన ఒక సినీకవి మాత్రమే కాదు, గొప్ప philosopher,thinker కూడా...కాబట్టి ఆయన చెప్పినదేదో ఒకసారి ఆలోచిద్దాం...

4 comments:

mnv said...

Entha oopika ekkada nunchi vochidi raa neeeku...

Nagarjuna said...

@mnv,
nuvvu neeku ishTamaina linux distributions ki, wallpapers ki peTTE time maatramE paDutundiraa naaku....
interest antE.....

Gopal Koduri said...

రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

మామా.. దీన్ని కాస్త విశదీకరిస్తావా? ఆయన ఉద్దేశ్యం అవేమి change తీసుకురాలేదన ? లేక change వచ్చినా.. అది revert ఐపోయిందనా ?

Nagarjuna said...

నా దృష్టిలో ఆ రెండు వాక్యాల అర్థం ఏంటంటే ఎంతో గొప్పవి,శక్తి కలవైనప్పటికీ ఆ రెంటిలో ఏ ఒక్కటీ వినాశనాన్ని ఆపలేకపోయాయి....
ఇక్కడ గురువుగారు ఈ పాటను సభ్యసమాజం మీద satirical గా రాశారు కాబట్టి వాటి అర్థం సందర్భోచితంగా
ఇలా ఉండుంటుంది...నా ఆలోచనకి చిక్కిందైతే అది...